విజయ్ దేవరకొండ కు ఆ ఒక్కడు మాత్రమే మిగిలాడా !

Seetha Sailaja
‘గీత గోవిందం’ మూవీ తరువాత విజయ్ దేవరకొండ కు చెప్పుకోతగ్గ హిట్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘లైగర్’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారినప్పటికీ విజయ్ దేవరకొండతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్న నిర్మాతల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈమధ్య ఎదురైన అనుభవాల రీత్యా విజయ్ దేవరకొండ తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయాలని ప్రయత్నించిన పరుశు రామ్ హరీష్ శంకర్ లు వేరే హీరోల వైపు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. పరుశు రామ్ నాగచైతన్య తో సినిమా చేయడానికి ఫిక్స్ అయితే హరీష్ శంకర్ ‘తెరి’ రీమేక్ కు పవన్ ను ఒప్పించాడు అని అంటున్నారు. ఇప్పుడు వీరిద్దరూ తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ దగ్గర కేవలం గౌతమ్ తిన్న నూరి మాత్రమే మిగిలారు అని అంటున్నారు.

వాస్తవానికి గౌతమ్ రామ్ చరణ్ తో సినిమా తీయాలని చాల గట్టిగా ప్రయత్నించాడు. అయితే చరణ్ ఆలోచనలు వేరే విధంగా ఉండటంతో గౌతమ్ విజయ్ కోసం ఒక ఫ్యామిలీ స్టోరీని రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథ పూర్తిగా విజయ్ నచ్చితే త్వరలోనే పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ సుకుమార్ కొరటాల లాంటి టాప్ డైరెక్టర్స్ సినిమాలలో నటించాలని ఉన్నప్పటికీ వారెవ్వరూ అందుబాటులో లేకపోవడంతో విజయ్ గౌతమ్ తిన్న నూరి తోనే సరిపెట్టుకోవలసి వస్తుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

సమంత తో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ సమంత అనారోగ్యం రీత్యా ఈమూవీ షూటింగ్ ఆగిపోవడంతో ప్రస్తుతం విజయ్ ఖాళీగా ఉన్నాడు. దీనితో ఒక మంచి కథ ఎంచుకుని వేగంగా సినిమా చేయాలి అంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న ఆప్క్షన్ ఒక్క గౌతమ్ తిన్న నూరి మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: