బ్రో డాడీ రీమేక్ లో చిరు, చరణ్?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో మలయాళ రీమేక్‌ సినిమా రానుందని ఇండస్ట్రీలో ఈ వార్తా ఎప్పటినుంచో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమా తర్వాత అభిమానులు మెగా ఫ్యామిలీ రీమేక్‌లు చేయడం పై చాలా అంటే చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా హీరోలు మాత్రం ఈ ఫీడ్‌బ్యాక్‌ని మాత్రం అస్సలు పట్టించుకోకుండా సీరియస్‌గా తీసుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. "బ్రో డాడీ" మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన మంచి హాస్యభరితమైన ఎంటర్‌టైనర్.మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో నటించారు. అలాగే పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత ఇంకా దర్శకుడు కూడా. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాని తెలుగులో ఎంతో ఇష్టంగా రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


అయితే ఈ వార్తా ఇంతకు ముందే చాలా సార్లు వైరల్ గా నిలిచింది. కాగా ఇపుడు మళ్ళీ సినీ వర్గాలలో ఈ వార్తపై చర్చ నడుస్తుంది. అయితే కేవలం ఇది బజ్  మాత్రమే. దీనిపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్‌లో తీయవచ్చు అంతేకాకుండా కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం చాలా ఉందని చిరంజీవి ఆలోచన. సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన నటనలోని కామెడీ యాంగిల్‌ని మరోసారి చూపించడానికి ఈ సినిమా స్కోప్ ఇస్తుందని భావిస్తున్నాడు. ఆయన గతంలో నటించిన చంటబ్బాయి, దొంగ మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లను కూడా మెగా అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా వారి కోరికను తీర్చే ఎంటర్‌టైనర్‌గా మారుతుందో లేదో చూడాలి.మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: