బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ టైం..!

shami
బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం ఫ్యామిలీ టైం నడిస్తుంది. 12వ వారం జరుపుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారు. ముందుగా ఆది రెడ్డి భార్య కవిత, పాపలను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. వారు వచ్చిన టైం లో టాస్క్ జరుగుతుండగా ఒక్కసారిగా బిగ్ బాస్ హౌజ్ లో ఆది రెడ్డి వైఫ్ ఎంట్రీ సర్ ప్రైజ్ చేసింది. హౌస్ లో అందరి ఆట సూపర్ అంటూ ఆదిరెడ్డికి కొన్ని సలహాలు ఇచ్చారు కవిత. ఇక పాప బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ కేక్ ని కూడా పంపించాడు బిగ్ బాస్. సీజన్ 6 లో తన పాప మొదటి బర్త్ డే జరుపుకోవడం మెంబరబుల్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి.
ఇక ఆది రెడ్డి తర్వాత రాజ్ మదర్ ఉమారాణి ఝౌస్ లోకి వచ్చారు. ఆమె కూడా అందరు ఆట బాగా ఆడుతున్నారని చెప్పారు. రాజ్ ఆట కూడా బాగుందని అందరు తనతో కూడా సెల్ఫీలు దిగుతున్నారని చెప్పారు ఉమారాణి. బిగ్ బాస్ కి రాకముందు రాజ్ ఎవరో తెలియదు కానీ బిగ్ బాస్ కి వచ్చాక అతను పాపులర్ అయ్యాడు. హౌస్ లో తమ ఫ్యామిలీ మెంబర్స్ తో గడపడం హౌస్ మెట్స్ కి మరింత జోష్ ఇచ్చింది. మంగళవారం ఎపిసోడ్ లో కేవలం ఆది రెడ్డి వైఫ్, రాజ్ మదర్ ని మాత్రమే చూపించారు. రేపు బుధవారం ఫైమా మదర్ కూడా హౌస్ లోకి వచ్చారు. ఆమె కూడా ఫైమా ఆట తీరు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అంటే అద్ ఫ్యామిలీ వీక్ అని చెప్పొచ్చు. 3 నెలలుగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ బిగ్ బాస్ కి వచ్చిన కంటెస్టంట్స్ వారి ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అవుతుంటారు. మొత్తానికి బిగ్ బాస్ షోని చివరి వారల్లో అయినా నిలబెట్టాలని బిగ్ బాస్ టీం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా ఉన్నాయి. మరో 3 వారాల్లో ముగియనున్న బిగ్ బాస్ సీజన్ 6 ఆడియన్స్ లో అంత గొప్ప రెస్పాన్స్ తెచ్చుకోలేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: