చిరంజీవి స్థానాన్ని భర్తీ చేస్తున్న బాలకృష్ణ !

Seetha Sailaja
గతంలో బాలకృష్ణ బయట ఫంక్షన్స్ కు వచ్చిన సందర్భాలు చాల తక్కువ. తన తోటి హీరోలు అయిన నాగార్జున వెంకటేష్ చిరంజీవి లతో బాలకృష్ణ కు సాన్నిహిత్యం చెప్పుకోతగ్గ స్థాయిలో కనిపించదు. అయితే ఆహా కోసం ‘అన్ ష్టాపబుల్’ టాక్ షోను హోస్ట్ చేసిన దగ్గర నుంచి బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ లో మాత్రమే కాకుండా బాలయ్య తీరులో కూడ చాల మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది.

యంగ్ హీరోలు కనిపిస్తే చాలు బాలకృష్ణ ఈమధ్య చాల సూపర్ యాక్టివ్ గా మారిపోయి వారి పై తెగ జోక్ లు వేస్తున్నాడు. ఆఖరికి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు బాలయ్య మహేష్ ను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బాలయ్య తన హాస్య చతురతతో మహేష్ ను నవ్వించిన సందర్భానికి సంబంధించిన ఫోటోలు కూడ వైరల్ అయ్యాయి. గతంలో చిరంజీవి చాలామంది యంగ్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కు అతిధిగా వచ్చి వారిని ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఆస్థానాన్ని బాలకృష్ణ తీసుకోబోతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. కొన్ని రోజులక్రితం బాలయ్య అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చి అక్కడ శిరీష్ ను ఒక ఆట ఆదుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ధంకీ’ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు అతిధిగా  వచ్చాడు . ఈమధ్యనే విశ్వక్ సేన్ పై సీనియర్ యాక్టర్ అర్జున్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆ విషయాలను ఏమీ పట్టించుకోకుండా బాలకృష్ణ ఇప్పుడు విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ ఫంక్షన్ కు అతిధిగా రావడమే కాకుండా ఆమూవీని ప్రమోట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఈవార్త టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన యంగ్ హీరోలను ప్రమోట్ చేసే గాడ్ ఫాదర్ గా బాలకృష్ణ మారిపోయాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: