సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..త్వరలోనే..

Satvika
సమంత పేరుకు పరిచయం అక్కర్లేదు..తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.. ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయినా సామ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ను సంపాదించుకుంది.ఆ సినిమాతోనే హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. అయితే తాజాగా సమంత యశోద అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. హరి శంకర్, హరిష్ నారాయణ్ దర్శకత్వం వహించారు మణిశర్మ సంగీతం అందించారు.

అలాగే సినిమాలో ఉండి ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్యపాత్రలో నటించగా శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. యశోద మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..

యశోద సినిమాని తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11వ తేదీ న రిలీజ్ చేయనున్నారు. యశోద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి యశోద సినిమాకి యూఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా యశోద సినిమా యూనిట్ ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. యశోద సినిమా 135 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది..మరి సమంతకు ఎలాంటి హిట్ టాక్ ను అందిస్తుందో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: