బిగ్ బాస్ 6 : మరో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్..?

Anilkumar
బిగ్ బాస్ హౌస్  ఈ వారం చాలా సీరియస్ గా సాగింది.ఇక  కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మిషన్ పాజిబుల్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టింది. అయితే ఈ క్రమంలో కోపాలు, వాదనలు, నెట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు జరిగాయి.ఇదిలావుంటే రేవంత్, గీతూ గేమ్ ప్రేక్షకులకు కోపం తెప్పించింది. ఇక ఎంత చెప్పినా గీతూది అదే మొండితనం. ప్రతి గేమ్ లో తన రూల్స్ తాను రాసుకుంటూ ఇది నా స్ట్రాటజీ అంటూ సమర్థించుకుంటోంది. రేవంత్ హౌస్లో మరో వరస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక కోపం వస్తే బూతులు తిడుతున్నాడు.

  అంతేకాదు ఆదిరెడ్డిని నా కొడకా అని తిట్టిన రేవంత్ రోహిత్ ని నీ యమ్మా అంటూ నోరు జారాడు. ఇక ఎదుటి వాళ్ళు గేమ్ లో పై చేయి సాధిస్తుంటే ఫిజికల్ గా హర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే వీకెండ్ కి సమయం కాగా హోస్ట్ నాగార్జున అందరూ బాగా ఆడారని సరిపెడతాడో... లేక తప్పు చేసిన కంటెస్టెంట్స్ ని నిలదీస్తాడో చూడాలి.ఈ వారం మరో షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు.ఇక  సూర్య ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. నాగార్జున గత వారం సూర్యను నేరుగా ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు.అయితే  ఈ వారానికి 10 మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు.

కాగా  శ్రీహాన్, వాసంతి, రాజ్ లను మినహాయిస్తే మిగతా ఇంటి సభ్యులు మొత్తం ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఇకపోతే ఓటింగ్ పరంగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ వెనుకబడినట్లు తెలుస్తోంది.ఇక  ఫైమా, మెరీనా, గీతూ డేంజర్ జోన్లో ఉన్నారట. కాగా ఈ ముగ్గురిలో ఫైమా 8వ స్థానంలో మెరీనా 9వ స్థానంలో గీతూ 10వ స్థానంలో కొనసాగుతున్నారట.  అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన గీతూ ఈ వారం ఎలిమినేట్ కానుందన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది.ఇక  అందులోనూ గీతూ పై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.అయితే  రెండు వారాలుగా ఆమె గేమ్ వరస్ట్ గా ఉందంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: