బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'NBK108' వాయిదా?.. కారణం ఏమిటంటే..?

Anilkumar
డైరక్టర్ అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో మొదలయ్యే అవ్వాలి. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. ఈ చిత్రానికి సంబంధించి టీమ్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక  అనుకోని విధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు లేటు అయ్యేటట్లు కనపడుతోంది.ఇక  అందుకు కారణం ..గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న సినిమా షెడ్యూల్ ఇంకా పూర్తి కాకపోవటమే అని తెలుస్తోంది. కాగా దాంతో జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుందంటున్నారు.

అయితే  సంక్రాంతి అయ్యాక ఈ సినిమా షూట్ ప్రారంభం కావచ్చు అని తెలుస్తోంది. ఇదిలావుంటే ఇక వీరసింహారెడ్డి చిత్రం రిలీజ్ అవుతుందని, అది బ్లాక్ బస్టర్ అవుతుంది కాబట్టి ఆ జోష్ లో షూట్ చాలా ఉత్సాహంగా జరుగుతుందని టీమ్ భావిస్తోంది. ఇకపోతే తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది.ఇక  బాలయ్యకు జోడిగా ఓ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారని , అలాగే విలన్ పాత్రకు కూడా ఓ బాలీవుడ్ నటుడుని తీసుకొచ్చి సినిమాకు క్రేజ్ తేబోతున్నారు.  అయితే హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక  ఇప్పటికే కూతురు పాత్రకిగాను ఆల్రెడీ శ్రీలీల ఎంపిక జరిగిపోయింది. కాగా ఈ సినిమాకి 'రామారావుగారు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.అంతేకాదు  దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఇక  గీతా ఆర్ట్స్ లోనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు.కాగా  'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంటులోను పరశురామ్ మాటలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే మొత్తానికి బాలకృష్ణ కుర్ర హీరోలకంటే ఫాస్టుగా ప్రాజెక్టులను చక్కబెడుతూ ఉండటం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: