ప్రభాస్ లా తొందర పడకూడదనే యశ్ ఇలా!!

P.Nishanth Kumar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ప్రభాస్ కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దారుణమైన ఫలితాలను ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. వాస్తవానికి రాజమౌళి లాంటి భారీ దర్శకుడు తో సినిమా చేసిన తర్వాత అంతటి స్థాయిలోనే సినిమాలు చేయాలి లేదంటే ఫ్లాప్ లు రావడం ఖాయం. రాజమౌళితో సినిమాలు చేసిన చాలామంది హీరోలు ఆ తర్వాత చేసిన సినిమాలతో ఏమాత్రం నేర్పించలేకపోయారు. అందువల్ల ప్రభాస్ చేసిన బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత అలాంటి భారీ చిత్రాన్ని చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆయనకు ఇచ్చిన సలహా.

కానీ ప్రభాస్ మాత్రం సుజిత్ దర్శకత్వంలో సాహూ అనే సినిమా చేశాడు. అది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి స్థాయిలో డిజాస్టర్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కంటెంట్ పరంగా టెక్నికల్ గా ఈ సినిమా ఎంతో బాగున్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో ఇది ఏమాత్రం సఫలీకృతం అవలేదు. దాంతో ఒక భారీ డిజాస్టర్ ఈ హీరో ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత ప్రేమ కథ సినిమా చేసి ప్రేక్షకులను అలరించాలనుకున్న ప్రభాస్ కు ఆ చిత్రంతో మరొక పరాజయాన్ని అందుకున్నాడు. దాంతో వరుసగా రెండు పరాజయాలను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు హిట్టు కొట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి.

ఆ విధంగా హీరో యశ్ కూడా కే జి ఎఫ్ లాంటి భారీ సినిమాలను చేసిన తరువాత విజయాన్ని అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ లా తొందర పడకుండా ఆచితూచి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కేజిఎఫ్ లాంటి భారీ తరహాలోనే సినిమాను చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఆయనకు కేజీఎఫ్ లాంటి భారీ విజయం అందుకున్న సినిమా తర్వాత ఈ చిత్రం చేస్తాడా చూడాలి. ప్రస్తుతం ఆయన నర్తన్ అనే ఓ దర్శకుడుతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ చిత్రం కూడా కేజీఎఫ్ లాంటి భారీ నేపథ్యం ఉన్న కథ అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: