మొదటి యాడ్ రెమ్యునరేషన్ ను బాలయ్య ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు.ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది.ఇక  ఈ రెండో సీజన్ అక్టోబర్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.  బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నారు.ఇది అలా ఉంటే తాజాగా బాలయ్య ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక  బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 40 ఏళ్ల పైనే అవుతోంది.

 ఇప్పటి వరకు యాడ్స్‌లో నటించలేదు.  ఆయన తాజాగా ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాడ్‌లో నటించారు. ఇక దీనికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక అది అలా ఉంటే మొదటి సారి ఓ యాడ్‌లో కనిపించిన బాలయ్య.. ఈ ప్రకటనలో నటించినందుకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో.. ఓ చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.తెలుస్తోన్న సమాచారం మేరకు తొలి యాడ్‌ కోసం బాలయ్య 15 కోట్ల రూపాయలు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక్కడ బాలయ్య గొప్పతనం ఏమంటే.. ఇక ఆ ప్రకటనకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని కూడా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళం ఇచ్చారట.  

ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ బాలయ్య అంటే అంతే మరి.. అయితే ఆయన గొప్పతనం అలానే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.  బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ తర్వాత బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి సినిమా రావడంతో పాటు, గోపీచంద్ మలినేని లాంటీ ఓ మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో రావడంతో మంచి అంచనాలున్నాయి.ఇక ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని టాక్. దీపావళి బ్రేక్ తర్వాత ఈ సినిమా ఈరోజు నుంచి షూట్ రెస్యూమ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే  ఈరోజు నుంచి హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇక థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: