రేవంత్ ని టార్గెట్ చేసిన నాగార్జున.. ఎందుకంటే????

murali krishna
బిగ్ బస్ తెలుగు సీజన్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొదట్లో చాలా చప్పగా అనిపించినా... 5 వారం నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గానే తయారయింది బిగ్ బాస్ షో.ఇక ఈ వీకెండ్ .. ఆదివారం దిపావళి సంబరాలతో బిగ్ బాస్ వేదిక బాగా కలర్ ఫుల్ గా తయారయ్యింది. రేపు దివాళి కాగా..ముందు రోజే సంబరాలు స్టార్ట్ చేశారు బిగ్ బాస్ టీమ్ హౌస్ లో ఈ సందర్భంగా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే ఓ కొత్త రకం గేమ్ ఆడించిన నాగార్జున.. ఇద్దరు కంటెస్టెంట్స్ ను సేవ్ చేశాడు. ఈ సందర్భంగా సేవ్ అయిన రేవంత్ పై పంచ్ పేలింది.
నామినేషన్ లో ఉన్న వారంత ఓ టేమ్ రికార్డర్ బటన్ నొక్కగా.. అందులో సేవ్ అయిన వారుముందు వాయిస్ విని పిస్తుంది.అందులో వరుసగా బటన్ నొక్కుతుండగా..రేవంత్ వంతు వచ్చే వరకూ బటన్ నొక్కగానే తన భార్య వాయిస్ వినిపించింది. రేవంత్ సేవ్ అయినట్టు అందులో వాయిస్ వినిపించింది మరీ. అయితే తాను సేవ్ అయ్యాన్న సంతోషంలో రేవంత ఆ వాయిస్ ఎవరిది అని పట్టించుకోలేదు హౌస్ లో ఎవరో ఒకరు.. ఆ వాయిస్ నీ వైఫ్ ది కదా అని అనగా.. అప్పుడు బల్ప్ వెలిగిన రేవంత్.. అవును.. అవును అంటూ తన భార్య వాయిస్ వినిపించినందుకు థ్యాంక్స్ చెప్పాడు అందరికీ.
ఇక ఇదే అదనుగా తీసుకున్న నాగ్ రేవంత్ తో ఓ ఆట ఆడుకున్నాడు అని చెప్పొచ్చు. నీ భార్య వాయిస్ కూడా మర్చిపోయావా... హౌస్ లోకి వచ్చిన ఆరు వారాల్లో ఇలా భార్యను మర్చిపోతే ఎట్లా అంటూ రేవంత్ ను ఆడేసుకున్నాడు నాగర్జున గారు. అంతే కాదు.. బిగ్ బాస్ ఫస్ట్ డే నీ వైఫ్ కళ్ళు కూడా గుర్తు పట్టలేకపోయావంటూ గుర్తు చేశాడు నాగ్. దాంతో రేంత్ సార్ మళ్ళీ నా భార్య ముందు బుక్ చేయకండి సార్ అంటూ బ్రతిమలాడుకున్నాడు రేవంత్. ఫస్ట్ కళ్లు గుర్తు పట్టలేకపోయావ్.. ఇప్పుడు వాయిస్ గుర్తు పట్ట లేకపోయావ్ అంటూ రేవంత్ ను ఓ ఆట ఆడుకున్నాడు నాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: