రవితేజతో,చిరంజీవి స్పెషల్ సాంగ్..రికార్డులు బద్దలు అవ్వాల్సిందే..

Satvika
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.. మొన్నీమధ్య రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్‌ సినిమా తో బాక్సాఫిస్ వద్ద భారీ ఘన విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.చాలా కాలం తర్వాత పొలిటికల్ లుక్‏లో చిరు కనిపించగా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ మూవీ అందించిన జోష్‏తో తన తదుపరి చిత్రాలను చకచకా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు చిరు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ల్లో మెగా 154 ఒకటి. డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ మూవీ ఇటీవల డబ్బింగ్ పనులను మొదలు పెట్టింది.ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. అతిథి పాత్రలో మాస్ మాహరాజా రవితేజ నటిస్తున్నారు. అన్నయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరుతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రవితేజ. తాజాగా ఈ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో వీరద్దరి కలయికలో ఓ మాస్ సాంగ్ ఉండనుందని.. ఇందులో చిరు, రవితేజలు కలిసి చిందులు వేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది..నిజంగా వీరిద్దరి కాంబొ లో సాంగ్ అంటే మెగా ఫ్యాన్స్ కు పునకాలే అని చెప్పాలి. మాస్ మాహరాజా.. మెగాస్టార్ కలిసి చిందిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు అభిమానులు.అయితే ముందు నుంచి ఈ టైటిల్ వాల్తేరు వీరయ్య అని టాక్ నడుస్తోంది. ఇందులో చిరు పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ టైటిల్ పోస్టర్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు..ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: