సురేష్ బాబు కొడుకుకి రిలీజ్ కష్టాలు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా ఆగ్ర నిర్మాతగా ఉన్న సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభి రామ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే దగ్గుబాటి సురేష్ పెద్ద కొడుకు దగ్గుబాటి రానా అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఆ విధంగా తన చిన్న కొడుకును కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చి హీరోగా నిలబెట్టాలని పట్టుదలతో సురేష్ బాబు ఉన్నాడు.

అందులో భాగంగా అభిరామ్ తొలి సినిమా చేసే బాధ్యతను తేజకు అప్పగించగా ఆయన అహింస అనే పేరు తో ఇప్పటికే సినిమాను కూడా చేయడం జరిగింది. నితిన్ ఉదయ్ కిరణ్ వంటి హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత తేజ ది. వారు అగ్ర హీరోలుగా ఉన్న సంగతి ప్రతి ఒ క్కరికి తెలిసిందే. ప్రేమ కథా సినిమాలను ఎంతో అందంగా రూపొందించి ప్రేక్షకులను దగ్గరయ్యేలా చేయడంలో ఈయన శైలి ప్రత్యేకమైనది. అందుకే తన చిన్న కొడుకు అ భిరామ్ తొలి సినిమా చేసే బాధ్యతను ఈ దర్శకుడికి అప్పగించాడు సురేష్ బాబు. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏ సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలను దగ్గుబాటి సురేష్ బాబు చేస్తున్నాడట. వాస్తవానికి ఆయన అనుకున్న సమయానికి ఇతర సినిమాలు ఉండడంతో కొన్ని ఇబ్బందులు కూడా ఈ సినిమాకు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. కరోనా తర్వాత చాలా సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయడానికి ఆయనకు సరైన స్లాట్ దొరకటం లేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: