ఫేడ్ అవుట్ డైరెక్టర్ కం బ్యాక్ చేసేనా..

P.Nishanth Kumar
చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయ మై ప్రేమకథ సినిమాలను ఎంతో వెరై టీగా రూపొందించే దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు తేజ. ఆ తర్వాత ఆయన చేసిన నువ్వు నేను జయం ధైర్యం నిజం వంటి సినిమాలు ఎంతటి స్థాయి లో విజయాలను అందుకున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా తేజ అగ్ర దర్శకుడుగా ఎదుగుతున్న క్రమంలో చేసిన పొరపాట్లు ఆయనను నార్మల్ దర్శకుడుగా మార్చే సాయి అని చెప్పవచ్చు.

ప్రయోగాత్మకంగా చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆలచించక పోవడంతో ఆయన దాదాపుగా ఫెయిడ్ అవుట్ అయిపోయినట్లుగానే కనిపించాడు. అయితే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకొని మళ్ళీ రేసులోకి వ చ్చిన తేజ ఆ తర్వాత చేసిన రెండు సినిమాల తో మళ్లీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అహింస అనే ఓ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రం గం సిద్ధం చేసుకున్నాడు. 

 దగ్గుపాటి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ హీరోగా నటిస్తున్న ఈ సి నిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చి త్రం వస్తుం దా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. సురేష్ బాబు తనయుడు హీరోగా వస్తున్నాడు అంటే కథ వి షయంలో ఎలాంటి అనుమానాలు పడవలసిన అవస రం లేదు. దా న్ని బట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తేజ గత సినిమాల లా గానే ఈ సినిమా పోలికలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా కు సంగీతాన్ని సమకూరుస్తూ ఉండడం విశేష. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: