'గజిని' సీక్వెల్ లో అల్లు అర్జున్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన " గజిని సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ". అంతేకాదు ఈయన నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇకపోతే తమిళంలో సూర్యను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రమది.ఇదిలావుంటే ఇక ఈ సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకొని సూర్యకు తెలుగులో కూడా మార్కెట్ ఏర్పడేలా చేసింది. అయితే అందుకే గజిని సినిమా సూర్య కెరియర్ లో స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. ఇకపోతే  హిందీలో ఈ మూవీని అదే పేరుతో అమీర్ ఖాన్ రీమేక్ చేయగా అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే  మరి అలాంటి గజిని మూవీకి సిక్వల్ రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ సినీ వర్గాలు.కాగా దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే గజిని సిక్వల్ స్టోరీపై కసరత్తులు చేస్తున్నారట. ఇకపోతే పూర్తి స్క్రిప్ట్ సిద్దమైన తరువాత ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక  ఈ మూవీలో హీరో ఎవరనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కాగా గజిని సిక్వల్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించేందుకు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటికే అల్లు అరవింద్ " గజిని 2 " పేరును

రిజిస్టర్ కూడా చేయించారనే రూమర్స్ వస్తున్నాయి.అయితే  ఇక " స్పైడర్ " డిజాస్టర్ " తరువాత మురుగదాస్ ను తెలుగు హీరోలు పెక్కన పెట్టేశారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ నేపథ్యంలో గజిని సిక్వల్ కూడా సూర్య తోనే మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడనే కోలీవుడ్ ఇన్ సైడ్ టాక్. అయితే మరి హీరో ఎవరనే దానిపై క్లారిటీ లేనప్పటికి గజిని సిక్వల్ మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: