ఓటీటీలో ఒకే ఒక జీవితం.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

murali krishna
యువ నటుడు శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం.
అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక అది అలా ఉంటే ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ రానుంది. ఈ సినిమా అక్టోబర్ 20న సోనిలివ్‌లో స్ట్రీమింగ్ వస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. చూడాలి మరి అక్కడ ఎలా ఆకట్టుకోనుందో.. ఇక శర్వానంద్ ఇటీవలే నటించిన మరో సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం ఇవ్వలేదు.
ఒకే ఒక జీవితం' అనే సినిమాతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్‌లో కూడా కణం పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఒకే ఒక జీవితం నిర్మించారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్లర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో రీతూ వర్మకు కూడా మంచి హిట్ పడింది.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం తెలంగాణ +ఏపీలో కలిపి రూ. 6.33 కోట్లు (రూ. 10.65 కోట్లు)కు పైగా షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.10.15 కోట్లు (రూ. 24 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది.
యూఎస్ఏ లో ఈ చిత్రం దాదాపు హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటింది. కలెక్షన్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. సైన్స్‌ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందించారు దర్శకుడు కార్తిక్. ఈ సినిమా టీజర్, అమ్మ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి.
సెప్టెంబర్ 9న విడుదల అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 10.15 కోట్ల షేర్ ( రూ. 24 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. రూ. 2.15 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
మొత్తంగా 'ఒకే ఒక జీవితం' మూవీతో శర్వానంద్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రం ద్వారా తెలుగు లోకి అడుగుపెడుతోంది, దీనికి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. తమిళంలో కణం పేరుతో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేశారు.
టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: