హిట్ లిస్ట్ లో చేరినా స్వాతి ముత్యం సినిమా..!!

murali krishna
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా గా వచ్చిన చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత
బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు మరి, నూతన దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత బెల్లం కొండ సురేష్  గారు మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రంకు అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబుకి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు  ఇంతాలా ఆదరించడం చాలా ఆనందంగా వుంది అని ఆయన అన్నారు . అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది.
పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో  నేను మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు" తెలిపారు బెల్లంకొండ సురేష్ గారు.
హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి స్వాతిముత్యంతో రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య స్వాతిముత్యం చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్  భారీగానే మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను  అస్సలు ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రసంశించడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ, చినబాబుకి కృతజ్ఞతలు" తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: