బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే హీరోగా ఛాన్స్ అందుకున్న శ్రీహాన్..!!

Anilkumar
మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి.  బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పడంలో సందేహం లేదు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీహన్ గతంలో ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ తో ప్రేమాయణం నడిపి మరింత పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ హాన్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు.

 తనదైన శైలిలో ఆట ఆడుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న శ్రీహన్ కి సంభందించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇక ఇదిలా ఉండగా శ్రీహాన్ నటించిన ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ సినిమా ఆవారా జిందగీ..శ్రీ హాన్ తో పాటుగా నలుగురు కుర్రాళ్ళు కూడా ఇందులో నటించారు. కాగా జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా ద్వారా అపేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్లుగా సమాచారం.అయితే  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  

ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా విభ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.ఇక  నంద్యాల మధుసూదన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమాలో ముక్కు అజయ్ , ఢీ చెర్రీ, జశ్వంత్ , శివాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన శ్రీహన్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న విషయం తెలిసిందే.  ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విడుదల చేస్తారో లేదో.. లేక ముందే విడుదల చేస్తారా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బిగ్ బాస్ ద్వారా తాను సంపాదించుకున్న ఇమేజ్ తన సినిమాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: