పవన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ...ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా మళ్లీ ప్రారంభం కాబోతుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ ప్రారంభించారు. అందులో స్క్రిప్ట్ వర్క్ జరిగింది, అలాగే సన్నివేశాల ప్రాక్టీస్ కూడా చేశారు. అంతేకాకుండా  ఇక మ్యూజిక్, సింగర్స్ ఇలా అన్ని విషయాల గురించి కూడా చర్చించారు.

అయితే నిన్న పవన్ కళ్యాణ్ వర్క్ షాప్ కి హాజరు అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.ఇక  వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ తో ఒక అమ్మాయి పాల్గొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కీరవాణి మధ్య నిల్చున్న ఆ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే ఇంతకు ఎవరు ఆ అమ్మాయి.. హరిహర వీరమల్లు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుందా అంటూ చర్చ మొదలైంది.ఇక ఆమె సెకండ్ హీరోయిన్ కాదు ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్. అయితే పూర్తి వివరాలు కర్నాటక మ్యూజిషియన్ అయినా అమలా చేబోలు ఈ సినిమాలో ప్లేబాక్ సింగర్ గా వ్యవహరించబోతుంది.

అంతే కాకుండా ఇక  కీరవాణితో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొనబోతుంది.ఇకపోతే విశాఖలో పుట్టి పెరిగిన అమలా చేబోలు గీతం యూనివర్సిటీలో విద్యను అభ్యసించింది. ఇక భీష్మ లో ఒక పాట పాడే అవకాశం దక్కించుకుంది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో ప్లేబాక్‌ సింగర్ గ పాటలు పాడబోతుంది.అంతేకాదు భవిష్యత్తులో ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ప్లే బాక్స్ సింగర్ గా మారే అవకాశం ఉంది. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత హీరోయిన్ గా ట్రై చేస్తే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయని కూడా కొందరు అభిప్రాయం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: