నాగార్జున 'ది ఘోస్ట్' మూవీకి సంబంధించిన ఆ పనులు పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా 'ది ఘోస్ట్' మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ,  టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ యూనిట్ ఒక రొమాంటిక్ సాంగ్ ను కూడా విడుదల చేసింది. ఆ రొమాంటిక్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ది ఘోస్ట్ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నాగార్జున రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే తాజాగా హిందీ సినిమా బ్రహ్మాస్త్రం లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. మరి ది ఘోస్ట్ మూవీతో నాగార్జున బాక్సా ఫీస్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: