ఆ పాటలో నాగార్జున రొమాన్స్ కుమ్మేసాడుగా. !!

murali krishna
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయసు దాటాడు.. అయినా కూడా ఆయన లుక్ మూడు పదుల వయసు అన్నట్లుగానే ఉంటుంది. ఈ వయసులో కూడా అంత ఎనర్జిటిక్ గా మరియు చార్మింగ్ గా ఎలా కనిపిస్తాడో ఆయనకే తెలియాలి.


ఇప్పటికీ కూడా ఆయన రొమాంటిక్ హీరో పాత్రలో నటించి మెప్పించ గల సమర్థుడు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. తాజాగా విడుదల అయిన ది ఘోస్ట్‌ సినిమా యొక్క పాటని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆయన వయసు 61 కానీ ఇంకా 30 ల్లోనే ఆయన ఉన్నట్లుగా ఈ పాటను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా కూడా ఇంకా రొమాంటిక్ పాటలు మరియు సన్నివేశాల్లో నటిస్తున్నాడంటే కేవలం అది నాగార్జునకే చెల్లింది అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన అలాంటి పాత్రలకు మరియు సన్నివేశాలకి దూరం ఉండాలని భావిస్తున్నాడు. అయినా కూడా ఆయనని అభిమానించే వారి కోసం అన్నట్లు.. అభిమానుల డిమాండ్ మేరకు దర్శకులు సినిమాలో కొన్ని ఆ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారట.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది ఘోస్ట్‌ సినిమా లో కూడా సోనాల్ చౌహాన్ తో నాగార్జున రొమాంటిక్ సాంగ్ లో నటించడం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య రొమాన్స్ సన్నివేశం కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్తున్నారట.. ముందు ముందు కూడా నాగార్జున ఇలాంటి రొమాంటిక్ కం లవ్ స్టోరీ సినిమాలు చేస్తాడని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేస్తే బెటర్ కనుక నాగార్జున తన సినిమాల ఎంపిక నిర్ణయంలో జాగ్రత్త పడాలంటూ కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ సినిమా రొమాంటిక్ డ్రామా గా ఉండక పోవచ్చు అనేది మాత్రం ఇండస్ట్రీ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: