'ఒకే ఒక జీవితం' గురించి 'అమల గారి మనసులో మాట...... నిజమేనా...!!

murali krishna
ఒకే ఒక జీవితం' సినిమా చూసినప్పుడు నాగార్జునకు వాళ్ల అమ్మగారు అన్నపూర్ణమ్మ గుర్తుకొచ్చారు అని అమల గారు అన్నారు . నిజంగా అది గ్రేట్‌ ఫీలింగ్‌. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వారి మనసుకు దగ్గరైన వారు గుర్తుకొస్తున్నారు అన్నది కచ్చితం అని కూడ అన్నారు .
'ఒకే ఒక జీవితం'లోని బ్యూటీ అదే దాగి ఉంది అన్నారు అమల అక్కినేని. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాదరణతో చాలా బాగా కొనసాగుతోంది. శర్వానంద్‌ తల్లిగా అమల నటన ప్రేక్షక హృదయాలను హత్తుకొంది. ఈ సందర్భంగా అమల మీడియాతో ముచ్చటించారు.ఈ సినిమా మీద ఆమె తన మనసులో మాట చర్చించారు.
'ఒకే ఒక జీవితం' అందరి మనసుకు నచ్చిన కథ. నిజాయతీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పటికైనా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాతో అది మరోసారి రుజువయింది. ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి నేను   ఇప్పుడూ, ఎల్లప్పుడూ సిద్ధం. అయితే ఇలాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకొన్న విషయం అని ఆమె అన్నారు .
'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' తర్వాత తెలుగులో ఇప్పటిదాకా మరోచిత్రం చేయలేదు. ఆ లోటు 'ఒకే ఒక జీవితం'తో తీరింది. కానీ ఈ మధ్యలో రెండు మలయాళ చిత్రాలు, మూడు హిందీ చిత్రాలు, ఒక వెబ్‌సిరీస్‌ చేశాను అయినా అవి నా మనసుకి సంతోషాన్ని ఐతే పెద్దగా ఇవ్వలేదు కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది నాకు . అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియా నేనే చూసుకుంటున్నాను. నా మనసుకు హత్తుకునే కథ విన్నప్పుడు, ఆ పాత్రకు నేనే మంచి ఎంపిక అనిపిస్తే మళ్లీ నటిస్తాను.
ఈ చిత్రంలో నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రేక్షకులు ప్రయాణం చేశారు. ఈ సినిమా చూశాక మా అమ్మగారు నన్ను గట్టిగా హత్తుకొని 'నిన్ను చూసి గర్విస్తున్నాను' అన్నారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస. నటిగా నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది అని ఆమె ఇంకోసారి గుర్తుచేసుకున్నారు .
'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున గారి నటన బాగా నచ్చింది. ఇంట్లో సినిమా విషయాలు చర్చిస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: