ఫ్రస్టేట్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు ఎందుకంటే!!

P.Nishanth Kumar
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు అన్నిటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడం ఎన్టీఆర్ అభిమానులలో ఎంతో అసహనాన్ని రేకెత్తిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత భారీ స్థాయిలో విజయాన్ని క్రేజ్ ను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పటిదాకా తన తదుపరి సినిమాను మొదలు పెట్టకపోవడం నిజంగా ఎవరినైనా నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. ఇతర హీరోలు ఒక సినిమాను పూర్తి చేయకముందే రెండు మూడు సినిమాలను మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ విధంగా మెల్లగా ముందడుగు వేయడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు.

 ఇటు కొరటాల శివ పైన కూడా వారు ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడమే గగనం అని వారు చెబుతున్న నేపథ్యంలో ఇంకా దానిని మొదలు పెట్టకపోవడం వారిలో ఎంతో ఆగ్రహాన్ని కలుగజేస్తుంది. పూర్తి చేసుకున్న కూడా ఎందుకు ఈ సినిమాను మొదలు పెట్టడానికి ఆలోచిస్తున్నారు అన్న అసహనం వారిలో నెలకొంటుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం చెబుతుంది ఇప్పటిదాకా హీరోయిన్ ఎంతో కూడా చేయలేదు ఎవరు నటిస్తున్నారు అన్న విషయాన్ని కూడా వారు చెప్పలేదు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో అన్న ఆగ్రహాన్ని వారు వ్యక్తపరచడంలో ఎలాంటి తప్పులేదు అని మరి కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఆచార్య పరాభవం నుండి కొరటాల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో దీని నుంచి పూర్తిగా బయటికి రావాలి అంటే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాల్సిందే. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చిన ఈ సినిమాను తొందరగా మొదలు పెట్టాలని భావిస్తున్నారు. మరి ఎప్పుడు మొదలవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: