నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున సరసన సోనల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను కూడా పెంచే విధంగా చేశాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేసింది.
 

తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ది ఘోస్ట్ మూవీ నుండి 'వేగం' అనే రొమాంటిక్ సింగిల్  ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్  అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ రొమాంటిక్ పోజులో నిలిచొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: