'ఓకే ఒక జీవితం' మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన నాని..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినా శర్వానంద్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ఒకే ఒక జీవితం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటించగా , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయ్యింది. టైమ్ ట్రావెలర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి ప్రస్తుతం మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ పై నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా నాచురల్ స్టార్ నాని 'ఒకే ఒక జీవితం' మూవీ పై స్పందిస్తూ ... ఇది చాలా మధురమైన మూవీ అని ,  శర్వానంద్ మరియు అమల మేడమ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ బెస్ట్ అని నాని పేర్కొన్నారు. నటుడు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ వర్మ ల నటన పై నాని ప్రశంసల  వర్షం కురిపించారు.

అమ్మ పాట సినిమా మొత్తానికి శోభను అందించిందని  నాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం మూవీ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించగా ,  ఈ మూవీ కి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళం లో కూడా ఏక కాలంలో విడుదల చేశారు. తమిళం లో ఈ మూవీ ని కణం పేరుతో విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: