నా రెండో సినిమా ఆ స్టార్ హీరోతో చేయాలని ఉంది... శ్రీ కార్తిక్

Pulgam Srinivas
దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో శ్రీ కార్తిక్ ఒకరు. ఈ దర్శకుడు తాజాగా విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శర్వానంద్ హీరోగా నటించిన రీతు వర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , ప్రియదర్శి వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం మూవీ కి దర్శకత్వం వహించిన శ్రీ కార్తిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. 

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు శ్రీ కార్తిక్ మాట్లాడుతూ ... నా రెండో మూవీ ని అల్లు అర్జున్ గారితో చాలా పెద్ద స్కేల్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ చేయాలనే ఆలోచన ఉంది. ఒక ఫాంటసీ కథ ఉంది. రియలిజం ఫాంటసీ లో ఉంటుంది. అల్లు అర్జున్ కి వెళ్లి కథ చెప్పాలి. చెన్నై లో తెలుగు మూవీ అంటే అల్లు అర్జున్ మూవీ నే. మా కుటుంబంలో అంతా అల్లు అర్జున్ అభిమానులే. అల్లు అర్జున్ తో మూవీ కోసం ఐదు సంవత్సరాలు నిరీక్షించడానికి కూడా ఓకే. ఇలా తాజా ఇంటర్వ్యూ లో ఒకే ఒక జీవితం మూవీ దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: