'ఒకే ఒక జీవితం' మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా , రీతు వర్మ ఈ మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది.

అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 9 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసింది. ఒకే ఒక జీవితం మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.


నైజాం : 40 లక్షలు .
సీడెడ్ : 6 లక్షలు .
యూ ఏ : 7 లక్షలు .
ఈస్ట్ : 5 లక్షలు .
వెస్ట్ : 4 లక్షలు .
గుంటూర్ : 6 లక్షలు .
కృష్ణ : 4 లక్షలు .
నెల్లూర్ : 3 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఒకే ఒక జీవితం మూవీ 0.75 కోట్ల షేర్ , 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  10 లక్షలు .
ఓవర్ సీస్ లో :  45 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ మొదటి రోజు 1.30 కోట్ల షేర్ , 2.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: