కమెడియన్ ఫిష్ వెంకట్.. గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ గురించి ప్రేక్షకులు అందరికి తెలిసే ఉంటుంది . ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో సహాయ నటుడిగా కామెడీ విలన్గా ఫిష్ వెంకట్ నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే సాధారణంగా ఫిష్ వెంకట్ అంటే ప్రేక్షకులు అందరు గుర్తుపడతారు. కానీ అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ వివరాలు ఏంటి అంటే మాత్రం చాలా మందికి తెలియదు.

 ఒకసారి ఆ వివరాలు తెలుసుకుందాం.. ఫిష్ వెంకట్ పూర్తి పేరు మంగళంపల్లి వెంకటేష్. హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకొని ఆ తర్వాత ముషీరాబాద్లో కూరగాయల మార్కెట్ లో చేపల వ్యాపారం చేస్తూ ఉండేవాడు వెంకటేష్. ఇక చేపల వ్యాపారం చేయడం కారణంగానే అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు కూడా వచ్చింది. ఈయనకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఇప్పటికే కూతురు వివాహం జరుగగా పెద్ద కుమారుడు యాదవ్ వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డి ఫర్ దోపిడి సినిమాల్లో విలన్ రోల్ లో నటించాడు. మరో ఇద్దరు కుమారులు ప్రస్తుతం చదువుకుంటున్నారు అని తెలుస్తోంది.

 తనకు దగ్గర స్నేహితుడు అయిన ఒకప్పటి స్టార్ హీరో శ్రీహరి ద్వారా ఫిష్ వెంకట్ సినిమాల్లోకి వచ్చాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమాలో మొదటిసారిగా నటించాడు. అందుకే వినాయక్ ను ఫిష్ వెంకట్ గురువు గా భావిస్తూ ఉంటారు.. ఇప్పుడు వరకు 90 సినిమాలలో నటించి బాగానే సంపాదించాడు.  ప్రతి సినిమాకి 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేవాడట ఫిష్ వెంకట్. ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: