ఆ సినిమాలో కీలక పాత్రలో నటించాను... బాబా భాస్కర్ మాస్టర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు. ఇది వరకే కిరణ్ అబ్బువరం మరియు శ్రీధర్ గాడే కాంబినేషన్ లో ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కిరణ్ అబ్బవరం కు హీరోగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ విడుదల దగ్గర పడిన సందర్భంగా తాజాగా బాబా భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ... కొరియోగ్రాఫర్ ,  డాన్సర్ , యాక్టర్ ఏది అయినా కూడా నాకు మూవీ నే జీవితం. నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ లో నేను హీరో కి ఫ్రెండ్ గా చాలా కీలకమైన పాత్రలో నటించాను. కిరణ్ అబ్బవరం తో పని చేయడం చాలా సులువుగా ఉంది అని తాజా పాత్రికేయుల సమావేశంలో బాబా భాస్కర్ మాస్టర్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: