సుధీర్ కి ఇన్ని ఆస్తులా.. నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా ?

praveen
సుడిగాలి సుదీర్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితుడు గా మారిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెరపై కమెడియన్ గా  సుధీర్  సాధించినంత క్రేజ్ ఎవరికీ రాలేదు.  ఇలా  తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. ఇక హీరో రేంజ్ లో బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకుని అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. అంతే కాదు ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయాడు సుడిగాలిసుధీర్. 1987లో విజయవాడలో ఆనంద్ భయ్యన్,  నాగమణి లకు జన్మించాడు ఈ జబర్దస్త్ కమెడియన్.  ఈయనకు ఒక తమ్ముడు ఒక సోదరి కూడా ఉన్నారు.

 ఇక చదువుకునే రోజుల్లోనే తన మామయ్య దగ్గర మ్యూజిక్ చేయడం నేర్చుకున్నాడు. ఇక ఇలా వచ్చిన డబ్బు అమ్మ చేతిలో పెట్టేవాడట సుధీర్.  ఇక ఆరోజుల్లోనే భరతనాట్యం  బాగా నేర్చుకున్నాడు. ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాడట.  ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ రావడం ఇంతలోనే అతని తండ్రికి యాక్సిడెంట్ కావడంతో ఇక కుటుంబ భారం అంతా సుధీర్ పై పడిపోయింది. తర్వాత  జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్నాడు సుడిగాలి సుదీర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకో కుండా దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి.

 ఇప్పుడు బుల్లితెరపై కార్యక్రమాలలో మాత్రమే కాకుండా  వెండితెరపై సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నాడు. ఇలా బుల్లితెరపై షోల ద్వారా నెలకు 30 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట  సుడిగాలి సుధీర్. మొన్నటి వరకు జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కు  3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడట.  మిగతా షోలలో రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు తీసుకుంటాడు. అతను  నటించిన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాకి 15 లక్షలు త్రీ మంకీస్ సినిమా కు 17 లక్షలు ఇటీవలే  ప్రేక్షకులకు ముందుకు వచ్చినా వాంటెడ్  పండుగాడు సినిమాకు 20 లక్షలు తీసుకున్నాడట. సుధీర్ ఆస్తి 5 కోట్ల వరకు ఉంటుందన్న టాక్  ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: