ఓటిటిలో 'రామారావు డ్యూటీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Anilkumar
మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు. అయితే  మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల నటించిన  సినిమా  'రామారావు ఆన్ డ్యూటీ'.ఇక ఈ సినిమా  సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.రవితేజ నటించిన ఈ  సినిమాని రాజకీయ వివాదాలు కమ్మిన దరిమిలా, విపరీతమైన నెగెటివిటీ విడుదలకు ముందే షురూ అయ్యింది.అయితే ఆ ఎఫెక్ట్ సినిమా మీద గట్టిగానే పడింది.ఇదిలావుంటే ఇక ఈ సినిమాలో కంటెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో, రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది 'రామారావు ఆన్ డ్యూటీ'.ఇకపోతే వివాదాల్లేకుండా వుండి వుంటే..

 ఈ సినిమా యావరేజ్ గ్రాసర్ అయినా అయి వుండేదంటారు ట్రేడ్ పండితులు.అయితే రవితేజ సరసన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్‌గా నటించిన విషయం మనందరికి తెలిసిందే. ఇక  రాజసి విజయన్ ఈ సినిమాలో మరో కథానాయిక.కాగా  శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కింది 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ.అయితే ఈ సినిమా ఓటీటీలోకి  కూడా వచ్చేస్తోంది. రవితేజ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతోంది.ఇకపోతే  సోనీ లివ్ ద్వారా ఈ సినిమాని ఓటీటీలో వీక్షించవచ్చు. కాగా ఎర్ర చందనం మాఫియా, ఓ డిప్యూటీ కలెక్టర్ మధ్య జరిగే పోరు ఈ సినిమా కథాంశం.

అయితే  థియేటర్లలో తేలిపోయిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఓటీటీలో ఏం చేస్తుందో చూడలి.ఇక ప్రస్తుతం రవితేజ కొత్త సినిమాల విషయానికొస్తే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాలో నటిస్తున్నాడు కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల జింతాక అని లిరికల్ సాంగ్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది ఈ సినిమాలో రవితేజ జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీలా కథానాయకగా నటిస్తోంది.ఇక త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: