ప్రపంచవ్యాప్తంగా 'కార్తికేయ 2' మూవీ సాధించిన లాభాలు ఇవే..!

Pulgam Srinivas
నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ మూవీ విజయాన్ని ఏ రేంజ్ విజయ్యని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించాడు.

ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.  శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అయ్యింది.  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ బాక్సా ఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే కార్తికేయ మూవీ సూపర్ హిట్ విజయం సాధించడంతో  కార్తికేయ 2 మూవీ పై మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 13.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇప్పటి వరకు 12 రోజుల బాక్సా ఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 41.80 కోట్ల షేర్ , 81.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 28.50 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: