'ఇండియన్ 2' మూవీ పనులను ప్రారంభించిన శంకర్..!

Pulgam Srinivas
భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా లోనే గొప్ప దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్న శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం భారతీయుడు మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా, కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.

భారతీయుడు మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ మూవీ ద్వారా దర్శకుడిగా శంకర్ మీ హీరోగా కమల్ హాసన్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా భారతీయుడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కొంత కాలం క్రితం భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఇండియన్   2 మూవీ నిలిచిపోయింది. దానితో కమల్ హసన్ 'విక్రమ్' మూవీ ని పూర్తి చేయగా , దర్శకుడు శంకర్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే శంకర్ మరి కొన్ని రోజుల్లో ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో ప్రారంభించబోతున్నారు. అందుకోసం ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రై ప్రొడక్షన్ పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ యు ఎస్ ఏ కి వెళ్లారు. ఆగస్ట్ చివరి వారంలో చెన్నైకి తిరిగి రానున్నారు. కమల్ హాసన్ యూ ఎస్ ఏ నుండి తిరిగి రాగానే ఇండియన్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: