మనీ: త్వరలో రైతుల ఖాతాలో నగదు జమ.. ఎలా తెలుసుకోవాలంటే..?

Divya
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే 2021 వాయిదాను గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన విడుదల చేసింది. ఇక ఈసారి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 15వ తేదీ లోపు 12వ విడత డబ్బులు 2000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక అటువంటి పరిస్థితులలో ఇప్పుడు పీఎం కిసాన్ పథకం కింద కొత్త జాబితాను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి కాకపోతే మీ పేరు తొలగించబడిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి.
ముందుగా మీరు పిఎం కిసాన్ పోర్టల్ని సందర్శించడం ద్వారా మొత్తం గ్రామాల జాబితాను కూడా చూడవచ్చు. ఇక ఎవరి ఖాతాలో ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ మీరు తెలుసుకొని అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎవరు ఎన్ని ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు ఎవరి ఖాతాలో ఏం తప్పు ఉంది? ఎలా డబ్బులు పొందాలి? ఇలా అన్ని వివరాలను తెలుసుకొని అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చొని ఈ పని చేయవచ్చు. ముందుగా పీఎం కిసాన్ పోర్టల్..https://pmkisan.gov.in కి వెళ్లి హోం పేజీలో మెనూ బార్ లోకి వెళ్లి ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లబ్ధిదారుల యొక్క జాబితా పై క్లిక్ చేయాలి.
ఇక మీరు రాష్ట్రంలోని డ్రాప్ డౌన్ మెనూ నుండి మీ రాష్ట్రాన్ని ఎంచుకొని దీని తర్వాత రెండవ ట్యాబ్ లో జిల్లా , మూడవ ట్యాబ్లో మండలం, నాలుగవ ట్యాబ్ లో బ్లాక్ మరియు ఐదవ ట్యాబ్లో మీ గ్రామం పేరు ఎంచుకోవాలి. ఇక తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయగానే మొత్తం గ్రామ జాబితా మీ ముందు లభిస్తుంది. ఇకపోతే ఈ కేవైసీ అందుబాటులో లేకపోవడం ఆధార్ ను అందించడం, భార్యాభర్తల ప్రయోజనం పొందడం , ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పేరులో ఏదైనా తప్పు, ఆధార్ ప్రామాణికరణ వైఫల్యం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా మీరు పిఎం కిసాన్ డబ్బులు పొందలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: