వేణు తొట్టెంపూడి, బాలయ్య మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Anilkumar
తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి మాస్ మహారాజ రవితేజ 'రామారావు..ఆన్ డ్యూటీ' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.అయితే  ఇందులో 'సీఐ మురళి'గా వేణు తొట్టెంపూడి నటించారు.ఇకపోతే వేణు నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అయితే కానీ, సినిమానే అనుకున్న స్థాయిలో లేదు. ఈ పిక్చర్ ద్వారా వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న వేణు తొట్టెంపూడి ..'రామారావు…ఆన్ డ్యూటీ'తో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే  త్వరలో 'చాయ్ బిస్కట్' వారి నిర్మాణ సారథ్యంలో వెబ్ సిరీస్ చేయనున్నారు.కాగా  'స్వయం వరం' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన వేణు తొట్టెంపూడి సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇదిలావుంటే ఇక వెండితెరపైన వేణు తొట్టెంపూడి కనబడితే చాలు..ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. అయితే తనదైన నటనతో నవ్వించడమే కాదు..ఎమోషనల్ సీన్స్ చేసి కంటతడి కూడా పెట్టించగలరు వేణు తొట్టెంపూడి.ఇక  వేణు తొట్టెంపూడి సినీ హిస్టరీ గురించి చాలా మందికి తెలుసు.అయితే  కానీ, ఆయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

ఇదిలావుంటే  వేణు తొట్టెంపూడి బంధువుల్లో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు.అయితే  తెలంగాణలోని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వేణు తొట్టెంపూడి బావ..ఈయన టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకుడిగా ఉన్నారు.ఇకపోతే  వేణు సోదరి నామా నాగేశ్వరరావు భార్య.అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ వేణు తొట్టెంపూడి మేనమామ.ఇక  మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వేణు తొట్టెంపూడి పెదనాన్న. అయితే సాంబశివరావు మనవడు మెతుకు మిల్లి శ్రీ భరత్..బాలయ్య చిన్న కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ లెక్కన బాలయ్య వేణుకు వరుసకు అన్నయ్య అవుతారు.అయితే  అదీ బాలయ్య, వేణు తొట్టెంపూడికి మధ్య ఉన్న బంధుత్వం. ఇకపోతే వేణు తొట్టెంపూడి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: