'పృథ్వీరాజ్ సుకుమారన్' డిజిటల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయిన పృద్వి రాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటి వరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమాలో కూడా నటించడం పోయినప్పటికీ , ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయి విడుదలై తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.  

డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కొంతకాలం క్రితమే జనగణమన సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పృథ్వి రాజ్ సుకుమారన్ 'కడువ' అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి షాజీ కైలాస్‌ దర్శకత్వం వహించగా , వివేక్‌ ఒబెరాయ్‌ ఈ మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మలయాళం తో పాటు తెలుగు , కన్నడ , తమిళ , హిందీ భాషల్లో విడుదల అయ్యింది.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న కడువ  సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. కడువ  మూవీ ఆగస్ట్ 4 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో మలయాళం తో పాటు తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: