లొకేషన్స్ వేట సాగిస్తున్న పుష్ప టీం...!!

murali krishna
అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై భారీ విజయం సాధించింది.


ఇంటనే కాదు రచ్చ కూడా గెలిచిన పుష్ప సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారట.. కాని ఇప్పటి వరకు ఈ సీక్వెల్ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. రేపు మాపు అంటున్నారే తప్ప పుష్ప 2 షూటింగ్ గురించి ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు.



తెలుగు కంటే నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట.అయితే ఈ క్రేజీ మూవీ మాత్రం నిరవధికంగా ఆలస్యమవుతూ వస్తోంది. మార్చి లోనే రెండో భాగాన్ని మొదలు పెట్టాలని భావించాడు కానీ.. అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్టు రెడీ చేయడానికి ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ను మించేలా.. భారీ బడ్జెట్ తో అదనపు హంగులతో ఈ సినిమాను పిక్చరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.


‘పుష్ప’ యూనిట్ ప్రస్తుతం లొకేషన్ల సమస్యను ఎదుర్కొంటోందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగాన్ని ఎక్కువ శాతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారనే విషయం తెలిసిందే. ఇప్పుడు అదే లొకేషన్స్ లో షూటింగ్ జరపాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే వరుణుడు అడ్డంకిగా మారాడట.


ఫారెస్ట్ రేంజ్ లో విపరీతమైన వర్షం పడుతోంది. ఇలాంటి పరిస్థితులతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఇది వర్షాకాలం కాబట్టి.. వానలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం అయితే లేదు. అక్కడే షూటింగ్ చేయాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు కొత్తదనం కోసం సుక్కూ అండ్ టీమ్ ‘రంగస్థలం’ షూటింగ్ జరిగిన లొకేషన్ లకి వెళ్లాలని కూడా అనుకున్నారట. కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతాలన్నీ దాదాపు నీట మునిగాయని తెలుస్తుంది.ఇప్పుడప్పుడే షూటింగ్ కు అనుకూలంగా మారడం అసాధ్యమనే చెప్పాలి.


ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ నేపథ్యానికి సరిపోయే లొకేషన్ల కోసం చిత్ర బృందం ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తోందని టాక్ అయితే వినిపిస్తోంది. కేరళ అడవుల్లో లేదా విదేశాల్లో షూటింగ్ చేసే ప్రాంతాల కోసం వెతుకులాట సాగిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: