దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' డిజిటల్ హక్కులు ఎవరికో తెలుసా..?

Pulgam Srinivas
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ కి ప్రేమ కథలను వెండితెరపై అద్భుతం గా తెరకెక్కించే హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు . హను రాఘవపూడి తన కెరీర్ లో అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ కథ ,  పడి పడి లేచే మనస్సు మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రేమకథ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నడు .

అలాంటి హను రాఘవపూడి మరోసారి సీతా రామం అనే పేరు తో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తుడడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఈ మూవీ కి యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ పెట్టారు . ఈ మూవీ లో లో ఒక కీలక పాత్ర లో రష్మిక మందన కనిపించబోతోంది . అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సుమంత్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా , దర్శకుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజా గా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన కొన్ని వారాలకు అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: