అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన హిట్ కోసం చాలా పరితపిస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నప్పటికీ కమర్షియల్ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈనెల 15న విడుదల కానున్నట్లు సమాచారం.ఇదిలావుండగా ఏజెంట్ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్. ఇకపోతే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
అయితే ఏజెంట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.కాగా ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు.ఇకపోతే ఏజెంట్ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో మనకు దర్శనమివ్వనున్నారు.ఇక స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా స్కేల్ మీద తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే, ఇక అఖిల్ కొత్త సినిమా పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదిలావుంటే వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరలో ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' హీరోతో ఓ రొమాంటిక్ లవ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు.
అయితే.. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏంటంటే.. ఈ సినిమాకి 'తమ్ముడు' అనే టైటిల్ ను వేణు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదే టైటిల్ తో గతంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేశాడు.పోతే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తాజాగా అఖిల్, పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' టైటిల్ తో సినిమా చేస్తే భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించనున్నాడని తెలుస్తోంది.అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.అఖిల్ అక్కినేని హీరోల సినిమా టైటిల్స్‌పై ఆసక్తి చూపించకుండా పవన్ మూవీ టైటిల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది...!!