ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి పై మరో బాధ్యత !

Seetha Sailaja

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎదో ఒక వివాదం లేదా ఎదో ఒక సమస్య గత కొన్ని సంవత్సరాల నుండి వెంటాడుతూనే ఉంది. కరోనా దెబ్బతో తిరిగి ఇండస్ట్రీ గాడిన పడుతుందా అని భయపడిన వారికి ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ సినిమాలకు వచ్చిన అత్యంత భారీ కలక్షన్స్ ఇండస్ట్రీలో ఆశలను చిగురింప చేసాయి.

మధ్యలో టిక్కెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. అలాంటి పరిస్థితులలో చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద కొడుకుగా ఎంటర్ అయి టిక్కెట్ల రేట్ల పెంపు వ్యవహారం పై రాయబారాలు చేసి ప్రభుత్వాలను ఒప్పించాడు. దీనితో చిరంజీవి కోరుకున్నా కోరుకోక పోయినా ఇండస్ట్రీ పెద్దగా మారిపోయాడు. ఇక సమస్యలు అన్నీ తీరాయి అని అనుకుంటున్నా సమయంలో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సమస్యలు మొదలయ్యాయి.

ఇండస్ట్రీకి చెందిన 24 విభాగాలకు చెందిన కార్మీకులు నిన్నటి నుండి సమ్మె బాట పట్టడమే కాకుండా ఆ సమ్మెను చాల ఉదృతం చేసారు. దీనితో ఇండస్ట్రీ పెద్దగా కొనసాగుతున్న చిరంజీవి షూటింగ్ కూడ ఆగిపోయింది. ప్రభాస్ చరణ్ నానీ ల సినిమా షూటింగ్ లు కూడ ఆగిపోయాయి. కృష్ణానగర్ లో ఇండస్ట్రీ కార్మీకులు అంతా సమ్మె ప్రభావంతో ఆవేశంగా ఉరకలు వేస్తున్నారు. హీరోలకు హీరోయిన్స్ కు కోట్లాది రూపాయలు పారితోషికాలు ఇచ్చే నిర్మాతలు తమ కనీసపు డిమాండ్స్ ను ఎందుకు పట్టించుకోవడంలేదు అంటూ ఆవేశంతో ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కరోనా పరిస్థితులు వల్ల నిర్మాతల దగ్గర డబ్బులు లేకపోతే హీరోలకు అంత భారీ పారితోషికాలు ఎలా ఇస్తున్నారు అంటూ సినిమా కార్మీకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 24 విభాగాలకు చెందిన కార్మీకులలో కొంత ఐక్యత లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ప్రారంభం అయిన ఈ సమ్మె తమ డిమాండ్ సాధించుకునే వరకు కొనసాగాగలుగుతుందా అన్న సందేహాలు కొందరకు ఉన్నాయి. గతంలో దాసరి నారాయణ జీవించి ఉన్న రోజులలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆసమస్య పెద్దది అవ్వకుండా దాసరి తెలివిగా వ్యవహరించేవారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో లేరు. దీనితో చిరంజీవి తన పెద్దరికంతో పూనుకుని ఈసమష్య కు సరైన పరిష్కారం అన్వేషించగలడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: