పొట్టి డ్రెస్ లో అందాలను ఆరబోస్తున్న యాంకర్ శ్రీముఖి..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలా యాంకరింగ్ రంగంలో మంచి సక్సెస్ ను సాధించిన వారికి సినిమాలలో కూడా అవకాశాలు దక్కు తూ ఉంటాయి.  అయితే యాంకరింగ్ రంగం ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని , ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే,  సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో శ్రీముఖి ఒకరు.
 

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీముఖి అనేక  టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది.  ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి ఫైనల్స్ వరకు వెళ్ళింది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే శ్రీముఖి ఎన్నో సినిమాల్లో నటించి వెండి తెరపై కూడా అలరించింది. కాకపోతే ఆ మధ్యలో శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ తో ఈ ముద్దుగుమ్మ అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది.
 

ఇలా టీవీ షో లతో , సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన ఇన్ స్టా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శ్రీముఖి కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.  శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలను పొట్టి డ్రెస్ ను వేసుకొని,  తన హాట్ థాయ్  అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ పొట్టి డ్రెస్ లో ఉన్న హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: