వామ్మో.. రష్మి క్రేజ్ మాములుగా లేదుగా..

Satvika
రేష్మీ గౌతమ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాలలో నటిగా ఎంట్రీ ఇచ్చింది.. ఏవో కొన్ని సినిమాలు అమ్మాయికి కాస్త పేరును తీసుకువచ్చాయి..అయితే తర్వాత కొన్ని సినిమాల లో హీరోయిన్ గా కూడా చేసింది.ఆ సినిమాలు అనుకున్న హిట్ ను అందించలేక పోయాయి.దీంతో అమ్మడు మళ్ళీ యాంకర్ గా సెటిల్ అయ్యింది..జబర్దస్త్ షో ద్వారా రేష్మీ పేరు బాగా ఫెమస్ అయ్యింది.ఎప్పుడూ షోకు ఎవరొచ్చినా కూడా రేష్మిని బాగా ఆడుకోవటం చెయ్యడం కామన్..తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా జబర్దస్త్ లో ఫుల్ ఫన్ ఎపిసోడ్ ను చేశారు..ఆ షోకు కమెడియన్ పేరెంట్స్ కూడా వచ్చారు.


నూకరాజు తండ్రి, బుల్లెట్ భాస్కర్ ఫాదర్, పంచ్ ప్రసాద్ భార్య, ఆటో రాం ప్రసాద్ ఫ్యామిలీ ఇలా అందరూ కూడా ఇది వరకు షోలో కనిపించి బాగానే ఫేమస్ అయ్యారు.బుల్లెట్ భాస్కర్ తండ్రి బాగా ఫేమస్ అయ్యాడు. అనేక స్కిట్లలో కూడా కనిపించాడు.బుల్లెట్ భాస్కర్ పరువు తీయడంలో తండ్రి ముందుంటాడు. దారుణమైన సెటైర్లుతో బుల్లెట్ భాస్కర్‌ను ఆడుకుంటాడు. అలా ఈ వారం కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లు రాబోతోన్నారు.ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు.


ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్ష వంటి వారు బాగానే ఫీలయ్యారు.ఎందుకంటే వీరికి తండ్రి లేరు. తన తండ్రి తాగుబోతు అని, అందుకే మాట్లాడే దాన్ని కాదు. కనీసం తాకే దాన్ని కూడా కాదు. చనిపోయిన తరువాత కాళ్లకు ముట్టుకున్నాను అంటూ పవిత్ర తెగ ఎమోషనల్ అయింది. వర్ష సైతం అలానే తన తండ్రిని తలుచుకుంటూ కన్నీరు పెట్టేసింది. కానీ బుల్లెట్ భాస్కర్ తండ్రి మాత్రం వచ్చీ రాగానే పంచ్ వేశాడు.కాగా, రత్తాలు ఇంటికి వెళ్తే కొట్టారట ఎందుకు నాన్న. అని అడుగుతాడు నూకరాజు. డోర్ కొట్టినందుకు కొట్టారురా అని అంటాడు. డోర్ కొడితే ఎందుకు కొడతారు.. అయినా కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా? అని నూకరాజు అంటాడు. బాత్రూం డోర్‌కు కాలింగ్ బెల్ ఎందుకు పెట్టుకుంటారురా? అని కౌంటర్ వేస్తాడు. మరో సందర్భంలో రష్మీ కోసం వచ్చానని అంటాడు.. ఇంకో సందర్భంలో అదిరిపోయిందని రష్మీని చూసుకుంటూ అంటాడు..ఇలా మొత్తానికి అతని వల్ల రేష్మీ క్రేజ్ డబుల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: