'ఆకాశమే నీ హద్దురా' హిందీ రీమేక్.. అందులోనూ సూర్యనే?
అయితే ఇటీవలి కాలంలో ఇతర భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సూర్య నటించిన గోపీనాథ్ పాత్రలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను త్వరలో పట్టా లెక్కించేందుకు అన్నిరకాల సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆకాశమే నీ హద్దురా సినిమాలో సూర్య హీరోగా నటించాడు అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ ఉండగా.. ఇక నిర్మాతలుగా జ్యోతిగా సూర్య వ్యవహరిస్తున్నారు. అంతేకాదండోయ్ ఇందులో గెస్ట్ రోల్ లో సూర్యా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తాను నటించిన సినిమాను తానే రీమేక్ చేసి ఇక తానే గెస్ట్ గా నటించడం కేవలం సూర్య మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. అంతేకాదు ఇక బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సినిమాకి కూడా అటు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు..