బిగ్ బాస్ పింకీ తో మానస్..అసలు మ్యాటరేంటి?

Satvika
బిగ్ బాస్ షో ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు అన్నీ చేస్తుంది..జంటల మధ్య లేని పోనీ ప్రెమలను క్రియేట్ చేస్తుంది.కొన్ని జంటలు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే భ్రమ లో ఉంటున్నారు.. తాజాగా మరో జంట వైరల్ అవుతూంది.ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.


బిగ్ బాస్ ద్వారా ప్రియాంక మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ప్రియాంక మానస్, జెస్సీ తో నడిపిన ట్రాకులతో బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ప్రియాంక బుల్లితెర నటుడు మానస్ తో చాలా క్లోజ్ గా ఉండేది. ఒక్కోసారి హద్దులు దాటి మానస్ మీద ముద్దుల వర్షం కూడా కురిపించేది. వీరి మధ్య ఉన్న రిలేషన్ లవ్ లేక ఫ్రెండ్షిప్ అంటూ ప్రేక్షకులకి అనుమానం వచ్చేది.బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత వీరి గురించి ఇలాంటి వార్తలు వినిపించలేదు. వీరిద్దరు అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ సోషియల్ మీడియాలో సందడి చేస్తుంటారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


 ప్రియాంక , మానస్ ఇద్దరు కలిసి మన్మధుడు సినిమాలో డైలాగ్ చెప్తూ వీడియో చేశారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్? నువ్వే కదా అందరితో సరదాగా మాట్లాడమన్నావ్.. నేను సరదాగా మాట్లాడమని చెప్పాను.. సరసాలు అడమని చెప్పలేదు. అయినా దానికి ప్యారిస్ నుండీ సెంటు తెచ్చవా? లేదూ పక్కనే ఉన్న కోటిలో కొన్నాను..అంటూ డైలాగ్ చెప్తూ వీడియో చేశారు..ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.. ఇక జనాలు ఆ వీడియోను మాత్రం వైరల్ చేసారు..మరి వీరిద్దరి మధ్య వున్న రిలేషన్ మాత్రం తెలియలేదు..చుద్దాము మున్ముందు తెలుస్తుందేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: