శిల్పా శెట్టి కారవాన్ చూసారా.. స్టార్ హోటల్ కూడా పనికి రాదు..!

Anilkumar
శిల్పా శెట్టి తెలియనివారంటూ ఎవరూ ఉండరు.ఈమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సాగర కన్యగా ఎప్పటికీ గుర్తుండిపోయింది.ఇకపోతే ఈమె గతం లో వెంకటేష్ సరసన సాహసవీరుడు సాగర కన్య, నాగార్జున సరసం ఆజాద్, బాలయ్య సరసన భలేవాడివి బాసు చిత్రాలలో నటించింది.ఇదిలావుంటే ఈమె  బాలీవుడ్ లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఆమె సోషల్ మీడియాలోను ఈ ముద్దుగుమ్మ రచ్చ మాములుగా ఉండదు.ఈ విషయం పక్కన పెడితే తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ కేసు కోర్టులో కొనసాగుతోంది. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు శిల్పా శెట్టి మానసిక వేదన... అ

నుభవించింది. అంతేకాదు కొన్ని రోజుల తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదల అయ్యారు. ఇక దీనితో శిల్పా శెట్టి ఫ్యామిలీ కాస్త కుదుటపడింది. కాగా శిల్పా శెట్టి ప్రస్తుతం వెండితెరపై మరిన్ని చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తోంది.ఇకపోతే జూన్ 8న శిల్పాశెట్టి 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే ఆ సందర్భంగా తనకు తానే ఓ ప్రత్యేకమైన గిఫ్ట్‌ ఇచ్చుకుంది. అంతేకాదు లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను తన సొంతం చేసుకుంది. కాగా బ్లాక్‌ కలర్‌లో ఉన్న ఈ వ్యాన్‌లో సకల సదుపాయాలు ఉన్నాయి. అయితే ఇందులో కిచెన్‌, హెయిర్ , వాష్‌ రూమ్‌, యోగా డెక్‌ సహా అన్నింటినీ అమర్చుకుంది. అంతేకాకుండా ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే శిల్పా ప్రయాణం చేసేటప్పుడు సమయం వృథా చేయకుండా యోగా చేసేందుకే యోగా డెక్‌ను అరేంజ్‌ చేసుకుందట.అయితే ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి.

ఇక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్‌ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు పలు టీవీ షోలకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నశిల్పా శెట్టి సినిమాలు కూడా చేస్తుంది. అంతే కాదు నికమ్మ చిత్రం జూన్‌ 17న రిలీజవుతోంది. ఇక అలాగే రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో ఓటీటీలోనూ అడుగు పెట్టనుంది.ఇకపోతే ఇప్పటివరకు అజయ్‌ దేవ్‌గణ్‌ (సింగం), రణ్‌వీర్‌ సింగ్‌ (సింబా), అక్షయ్‌ కుమార్‌ (సూర్యవంశి)లను పోలీస్‌ ఆఫీసర్స్‌గా చూపించారు రోహిత్‌ శెట్టి .ఇక ఈసారి శిల్పాశెట్టిని పోలీస్‌గా వెండితెరపై ప్రజెంట్‌ చేయనున్నాడు. అయితే శిల్పాశెట్టి 1993లో షారుఖ్ ఖాన్‌తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఆమె 90వ దశకంలో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇకపోతే దక్షిణాది భాషాల్లో కూడా శిల్ప నటించింది.అంతేకాకుండా ఈమె కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్‌తో కలిసి సినిమా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: