వంద కోట్లు అంటే అంతా చీపా.. హీరోల టార్గెట్ మామూలుగా లేదే!!

P.Nishanth Kumar
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు 50 కోట్ల కలెక్షన్లు అందుకోవడం అంటే గగనం అని చెప్పాలి. కానీ ఈరోజులలో వచ్చే సినిమాలు వంద కోట్లు అందుకోవడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సినిమా విడుదల తర్వాత తొలిరోజునే వారికి సంబంధించిన సినిమాలు వంద కోట్లు రాబట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు పెద్ద హీరోలు. ఆ విధంగా 100 కోట్లు రాబట్టుకోని హీరోలను చాలా చీప్ గా చూస్తున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతున్నాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వస్తున్న సినిమాలను గమనిస్తే 100 కోట్లు కలెక్షన్లు రావడం అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది.

బాహుబలి సినిమా తరువాత తెరకెక్కిన చాలా సినిమాలు వంద కోట్ల పై చిలుకు కలెక్షన్లను రాబట్టింది భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ విధంగా హీరోలు కూడా మంచి రెమ్యునరేషన్ ను రాబట్టుకుంటున్నారు. మంచి కథలు ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు గా ఉన్న చాలా మంది హీరోల సినిమాలు విడుదలకు ముందే వంద కోట్ల బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది.

 ఆ విధంగా విడుదల తర్వాత సినిమా బాగుంటే మరిన్ని కలెక్షన్లను సాధిస్తున్నారు కొన్ని భారీ బడ్జెట్ సినిమా లు వేయి కోట్ల కలెక్షన్ అందుకోవడా నికి ఎక్కువ సమయాన్ని తీసుకోవడం లేదు. మరి రాను న్న కాలంలో మన సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ఎలాంటి స్థాయి కలెక్షన్లను అందుకుటాయో చూడాలి. కొంతమంది యువ హీరోలు కూడా ఈ మార్క్ అందుకోవడానికి పెద్దగా కష్ట పడటం లేదు. మరి భవిష్యత్ లో హాలీవుడ్ స్థాయి లో సినిమా లు చేసి అంతటి స్థాయి కలెక్షన్స్ మన సినిమాలు అందుకోవాలి అని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: