అనిల్ రావిపూడి సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న బాలయ్య..!

Pulgam Srinivas
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.  అనిల్ రావిపూడి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా కొనసాగుతున్నాడు.

అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ ,  వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ తెరకెక్కిన ఎఫ్ 3 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతోంది.  ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు.  అనిల్ రావిపూడి , బాలకృష్ణతో సినిమాను చేయడానికి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాడు.  బాలకృష్ణ 100 వ సినిమానే అనిల్ రావిపూడి దర్శకత్వం చేయాలనుకున్నాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు.

కొన్ని రోజుల క్రితమే బాలక్రిష్ణ , అనిల్ రావిపూడి సినిమాకు ఓకే చెప్పాడు.  ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  అనిల్ రావిపూడి , బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలు బాలకృష్ణ 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను  పోషించనున్నారట. ఇలా అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: