అక్కడ ఘనంగా రౌడీ హీరో బర్తడే హంగామా..!!

Divya
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు కావడంతో నిన్న సాయంత్రం నుంచి బర్తడే జోరు మొదలైంది అని చెప్పవచ్చు. లైగర్, జనగణమన సినిమా టీమ్ వారు రౌడీ బాయ్ కి తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ మ్యాన్లీ లుక్ రివీల్ చేసి ఆయనకి బర్త్డే బిగ్ ట్రీట్ ఇవ్వడం జరిగింది.. ఇక నిన్నటి వరకు విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నారు అనే విషయం ఎవరికీ తెలియలేదు. కానీ నేడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది.. ఈ నేపథ్యంలోనే విజయ్ తో పాటు సమంత కూడా చిత్రనిర్మాణం స్పాట్ లోనే ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.
నిన్నటి రాత్రి నిర్మాతలు విజయ్ దేవరకొండ కి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ తో పాటు చిత్ర నిర్మాత వై వి రవి శంకర్,  దర్శకుడు శివ నిర్వాణ,  హీరోయిన్ సమంత అంతా కలిసి ఒక ఫోటో దిగగా ఇది బయటకు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం విజయ్ లుక్ పూర్తి డీసెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లైగర్ సినిమా కోసం రకరకాల గెటప్ లు వేసిన విజయ్.. ఆ పాత్ర నుంచి ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేశారు. అంతే కాదు గీతగోవిందం లో లాగా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
అయితే శివ నిర్వాణ ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ఏమిటి అనే విషయం అయితే ఇంకా బయటకు రాలేదు. ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీగా కాశ్మీర్ లోని కీలక షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లోనే తన పుట్టిన రోజు వేడుకలను విజయ్ దేవరకొండ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: