అన్ని కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతున్న 'ఆచార్య' మూవీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కావడం, ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటించడం, ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఆచార్య సినిమాపై మెగా అభిమానులతో పాటు మామూలు జనం కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఆచార్య  మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆచార్య మూవీ చేసుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఆచార్య మూవీ కి 133 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆచార్య మూవీ  అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుతున్నట్లు తెలుస్తోంది.   నైజాం ఏరియాలో ఆచార్య మూవీ 38 కోట్లు, సీడెడ్‌లో ఆచార్య మూవీ 20.5 కోట్లు, ఉత్తరాంధ్రలో  13 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 ఇక  ఆచార్య మూవీ ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలో 9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7.5 కోట్లు, కృష్ణా జిల్లాలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4.2 కోట్ల బిజినెస్ చేసింది. కేవలం నైజాం, ఆంధ్రాలోనే ఆచార్య మూవీ 109.2 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆచార్య మూవీ ఇతర రాష్ట్రాలలో 12 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆచార్య మూవీ ఓవర్సీస్ లో 12 కోట్ల మేర బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆచార్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 133.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఆచార్య మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేయాలి అంటే 135 కోట్ల మేర కలెక్షన్లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: