విజయ్ దళపతి చేసిన పొరపాటు అదే..!!

P.Nishanth Kumar
విజయ్ దళపతి హీరోగా విడుదలైన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు అన్నది కొంతమంది చెబుతున్న మాట.  సౌత్ సినిమా పరిశ్రమలో విజయ్ దళపతి కి ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన సినిమాలకు ఎంత ఖర్చు చేసినా కూడా తిరిగి తీసుకు వస్తుంది అనేది ఆయన అభిమానులు మరియు ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు చెప్పే మాట. భారీ ఫాలోయింగ్ అంతులేని మార్కెట్ ఆయన సొంతం. 

ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా గత సినిమాల రికార్డులను తుదిచి పెట్టి కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మాస్ సెంటర్ లలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ విధంగా భారీ అంచనాల మధ్య బీస్ట్ సినిమా విడుదల అయ్యింది ఈ సినిమా. ఫలితం కొంత మందినీ నిరాశపరిచిన కూడా క్వాలిటీ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ ఏ విధంగా కూడా రాజీ పడకపోవడం విజయ్ అభిమానులు ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నారు. ఖర్చు విషయంలో వెనుకడుగు వేయలేదు. కథ అంతా ఒక మాల్ చుట్టే తిరిగినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనేది వారు చెబుతున్న మాట.

దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ రెండు సినిమాలు మాత్రమే చేయగా ఆయన విజయ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించి పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆరంభంలోనే హీరో హీరోయిన్లను మాల్ లో ఉంచి లాక్ చేసేసాడు అందరు కూడా యోగి బాబు నుంచి కామెడీనీ ఆశించారు. కానీ అది కూడా నామమాత్రమే అయిపోయింది. అయితే పవర్ ఫుల్ గా ఎక్స్ పెక్ట్ చేసిన సినిమా ఈ విధంగా ఒక మాల్ చుట్టే తిరగడం తో అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. ఇది సినిమా కే మైనస్ అనే చెప్పుకోవాలి. ఏ పాత్రను హైలెట్ చేసే ప్రయత్నమే జరగలేదు. ప్రాణభయంతో పరుగులు తీయడం చూస్తే విజయ్ మాత్రం ఎదురుగా నిలవడం కూడా తేలిపోయింది. ఇక పాటల కు వచ్చిన రెస్పాన్స్ సినిమాకు రాలేదనే చెప్పాలి. కథ విషయంలో విజయ్ దళపతి కొంత జాగ్రత్త వహిస్తే ఇంకా బాగుండేది అని కొంతమంది సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: