టాప్ హీరోల సినిమాల పాటల సందడి !

Seetha Sailaja
ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్ లో టాప్ హీరోల సినిమాల సందడితో సీజన్ హోరెత్తి పోతుంది. ఫలాన టాప్ హీరో సమ్మర్ విజేత అంటూ సోషల్ మీడియాలో పెద్దగా రచ్చ జరగడం మామూలే. అయితే ఈ సంవత్సరం ఎన్నికల హడావిడి వలన టాప్ హీరోల సినిమాలు ఏవీ సమ్మర్ సీజన్ కు విడుదల అవ్వకపోవడంతో ఈ సమ్మర్ సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆన్ సీజన్ గా మారిపోయింది.

దీనితో టాప్ హీరోల అభిమానులకు హడావిడి చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. అయితే రాబోతున్న మే నెల మరొక విధంగా టాప్ హీరోల అభిమానుల మధ్య వార్ కు తెర తీయబోతోంది. రాబోతున్న మే డే నాడు కార్మికుల దినోత్సవం సందర్భంగా ‘పుష్ప 2’ నుండి ఒక లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ ల కాంబిబేషన్ కాబట్టి ‘పుష్ప 2’ ని పాటలు ‘పుష్ప’ రేంజ్ కి మించి ఉంటాయని బన్నీ అభిమానుల అంచనా. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కల్కి’ మూవీకి సంబంధించిన పాటను కూడ మేనెల రెండవ వారంలో విడుదల చేస్తారని అంటున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీలోని పాటలు ఎలా ఉంటాయి అన్న ఊహలు ఎక్కువగా ఉన్నాయి.

సమ్మర్ రేస్ లో విడుదల కావలసి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ దసరా రేస్ కు మారిపోవడంతో ఈమూవీ పై క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి మే నెలలో జూనియర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర’ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసి తారక్ అభిమానులకు జోష్ ను కలిగిస్తారని  వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ కమల్ హాసన్ కూడ ఎంటర్ అవుతున్నాడు. శంకర్ కమల్ ల కాంబినేషన్ లో జూన్ లో రాబోతున్న ‘ఇండియన్ 2’ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను కూడ మే లోనే విడుదల చేస్తారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: